Poultry Farming : నాటు కోళ్ళ పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. నెలకు రూ. 15 లక్షల టర్నోవర్

మార్కెట్ లో కడక్ నాథ్ కోళ్ళకు మంచి డిమాండ్ ఉండటంతో నాటు కోళ్ల పెంపకం చేపట్టాలనుకున్నారు. 2017 లో 500 కడక్ నాథ్ కోళ్లు, 10 పందెం కోళ్లతో కొళ్ల పెంపకం ప్రారంభించారు.  అయితే మొదట అంత అవగాహన లేక నష్టాలను చవిచూశారు. అయినా వెనుకడుగు వేయలేదు. దినదినాభివృద్ధి చెందుతూ.. వ్యాపార సరళిలో ఒక పరిశ్రమలా విస్తరించారు.

Poultry Farming : జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం అనేది ప్రతి ఒక్కరి కల . ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణించేవారు అనేక మంది యువతను మనం చూస్తున్నాం. చదువుతో సంపాదించిన విజ్ఞానాన్ని స్వయం ఉపాధిగా మలుచుకుని రాణించేవారు చాలా అరుదు. అందులోను వ్యవసాయంలో రాణించాలనుకోవటం ప్రస్థుత పరిస్థితుల్లో సాహసమే మరి. కానీ పట్టుదల, కార్యసాధన ఉంటే సాధించలేనిది వుండదని నిరూపిస్తున్నాడు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యుకుడు. సొంతంగా పలు రకాల కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధిని ఏర్పర్చుకున్నారు. కష్టానికి తగ్గ ఫలితం పొందుతున్నాడు.

READ ALSO : Country Chicken: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల పెంపకం

నాటు కోళ్ళ పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటు కోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు.. చేదోడువాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది. ఈ నేపధ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం, నున్న గ్రామానికి చెందిన యువకుడు ప్రదీప్ .. కడక్ నాథ్ కోళ్లు, పందెంకోళ్ల పెంపకం చేపట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.

READ ALSO : Nunna Village : లక్షల జీతం వదులుకుని కోళ్ల పెంపకం

రైతు ప్రదీప్ ఎంబిఏ వరకు చదువుకున్నారు. కొన్నేళ్ల పాటు పలు ప్రైవేట్ కంపెనీలలో మార్కెటింగ్ జాబ్ చేశారు. అయితే సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నారు. మార్కెట్ ను క్షూణ్ణంగా పరిశీలించారు.. మార్కెట్ లో కడక్ నాథ్ కోళ్ళకు మంచి డిమాండ్ ఉండటంతో నాటు కోళ్ల పెంపకం చేపట్టాలనుకున్నారు. 2017 లో 500 కడక్ నాథ్ కోళ్లు, 10 పందెం కోళ్లతో కొళ్ల పెంపకం ప్రారంభించారు.  అయితే మొదట అంత అవగాహన లేక నష్టాలను చవిచూశారు. అయినా వెనుకడుగు వేయలేదు. దినదినాభివృద్ధి చెందుతూ.. వ్యాపార సరళిలో ఒక పరిశ్రమలా విస్తరించారు.

READ ALSO : Natu Kodi Farming : నాటుకోడి పచ్చళ్లతో.. లాభాలు ఆర్జిస్తున్న పి.హెచ్.డి స్టూడెంట్

కోళ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి.. బైబ్యాక్ ఒప్పందంతో వాటిని అధిగమిస్తున్నారు రైతు. మాంసంగా, పిల్లలను, కోడిగుడ్లను అమ్ముతూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. 6 లక్షలతో ప్రారంభించిన వ్యాపారాన్ని నేడు 3కోట్ల వరకు తీసుకొచ్చారు. ప్రస్తుతం నెలకు 15 లక్షల టర్నోవర్ చేస్తున్నారు యువపారిశ్రామిక వేత్త ప్రదీప్. వ్యవసాయానికి అనుబంధరంగాల్లో పాడికంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ రోజువారి శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఇలా ఎందులోనైనా కోళ్ళ పెంపకమే ఉత్తమమని నిరూపిస్తున్నారు  ప్రదీప్.

ట్రెండింగ్ వార్తలు