Youngster Doing Mechanized Farming
Mechanized Farming : ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు… పెద్ద కంపేనీలో ఉద్యోగం సంపాదించాడు .. మంచి జీతం.. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువ.. కుటుంబ పరిస్థితులు సొంత ఊరికి చేరుకునేల చేశాయి. అందరిలా కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల సాగును చేపట్టాడు.. కూలీల సమస్యను అధిగమించి.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందుతున్నారు.
దేశానికి వెన్నెముక రైతన్న. వ్యవసాయం లేనిదే మానవ మనుగడ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరికీ నోట్లోకి ఐదు వేళ్లూ పోతున్నాయంటే అది అన్నదాత కష్టం. ఆరుగాలం శ్రమించి చెమట చిందిస్తే కానీ పొలం పండదు, జనానికి పూట గడవదు. అయితే గత కొన్నేళ్ళుగా పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయంలో పెరిగిన కూలీల సమస్య, పెట్టుబడులతో.. సాగు భారంగా మారింది. దీంతో రైతులు సాగును వదిలేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో చదువుకున్న యువత వ్యవసాయరంగంలోకి వస్తుండటం..
ఆధునిక , సాంకేతిక పరిజ్ఞానాన్ని సాగుకు అనుసందానం చేస్తూ.. సాగు రూపురేఖలనే మార్చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట మండలం, జమ్ముగ్రామానికి చెందిన యువరైతు రెడ్డి సతీష్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి .. ఎయిర్ క్రాప్ట్ మేయింటనెన్స్ ఇంజనీర్ గా పనిచేసికూడా వ్యవసాయంపై ఉన్న మక్కువతో సాగులో యాంత్రీకరణ ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పొందుతున్నారు. .
వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించి అధిక దిగుబడి సాధించాలంటే ఆధునిక వ్యవసాయ పరికరాలు వాడాల్సిందే. వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి వీలవుతుంది. దీన్నే తూచాతప్పకుండా పాటిస్తూ… మంచి దిగుబడులను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు యువరైతు సతీష్.
Read Also : Tomato Cultivation : రబీకి అనువైన టమాట రకాలు – అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం