Tomato Cultivation : రబీకి అనువైన టమాట రకాలు – అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం

Tomato Cultivation : శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం.

Tomato Cultivation : రబీకి అనువైన టమాట రకాలు – అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం

Tomato Cultivation Techniques And Management in Crop

Updated On : October 12, 2024 / 2:39 PM IST

Tomato Cultivation : ఏడాది పొడవునా టమాటను సాగుచేస్తున్నారు రైతులు . అయితే  శీతాకాలంలో సాగుచేసిన పంటలో అధిక దిగుబడితోపాటు, నాణ్యత అధికంగా వుంటుంది. కానీ  నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటను దఫదఫాలుగా విత్తుకుని సాగుచేస్తున్నారు. శీతాకాలపు పంటనుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు పంట చివరి వరకు ఎలాంటి మెళకువలు పాటించాలో చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడుభూములు ఈపంటసాగుకు పనికిరావు.

అయితే రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోకపోవడం.. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో చీడపీడలు ఆశించి పంట దెబ్బతింటోంది. దీంతో ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో శీతాకాలానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో.. సాగునీరు, ఎరువుల యాజమాన్యం.. చీడపీడల నివారణకు కూడా అంతే ముఖ్యం. సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులు అందించాలంటున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణకు అధిక ఖర్చులు చేయకుండా తక్కువ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు