LG Polymers Gas Leakage…వారికి సలాం కొడుతున్న ప్రజలు

  • Publish Date - May 8, 2020 / 03:51 AM IST

విశాఖలో విష వాయువు వెలువడడం..వెంటనే పోలీసులు, NDRF బృందాలు అలర్ట్ కావడం..ప్రమాదం ఎక్కువ కాకుండా తీసుకున్న చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారు చేసిన సహాయానికి ప్రజలు జై జై కొడుతున్నారు. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. సహాయుక చర్యల్లో పాల్గొన్న వారు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

విశాఖపట్టణం నగరంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్ ఆర్ వెంకటాపురంలో 2020, మే 07వ తేదీ తెల్లవారుజామున రసాయనం వెలువడడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒళ్లంతా మంటలు, దుద్దర్లు రావడంతో..ఏం జరుగుతుందో…తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. విష వాయువు వెలువడడం..శ్వాస తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

వేకువజామున 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తలుపు కొట్టి అందర్నీ అలర్ట్ చేశారని ప్రజలు తెలిపారు. ప్రాణాలకు తెగించి..అస్వస్థతకు గురైన వారిని, స్పృహ కోల్పోయిన వారిని అంబులెన్స్ లో తరలించారని వెల్లడించారు. 12 రక్షక్‌ వాహనాలు, 108 వాహనాలు 15, అంబులెన్సులు 12, నాలుగు హైవే పెట్రోలింగ్‌ వాహనాలు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన తరలించాయి. మినీ బస్సులను సైతం ఏర్పాటు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో 12 మంది చనిపోగా..KGH ఆసుపత్రిలో 193 మంది చికిత్స పొందుతున్నారు. 
 

Also Read | విశాఖలో గ్యాస్ లీక్ ఎప్పుడేం జరిగిందంటే

ట్రెండింగ్ వార్తలు