ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 55,406 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇవాళ 70,584 శాంపిల్స్ ను పరీక్షించగా 10,093 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు 2,784 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,20,009 శాంపిల్స్ ను పరీక్షించారు.
గడిచిన 24 గంటల్లో అనంతపురం 1371, చిత్తూరు 819, తూర్పుగోదావరి 1676, గుంటూరు 1124, కడప 734, కృష్ణా 259, కర్నూలు 1091, నెల్లూరు 608, ప్రకాశం 242, శ్రీకాకుళం 496, విశాఖ 841, విజయనగరం 53, పశ్చిమ గోదావరి 779 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇవాళ కరోనాతో తూర్పు గోదావరి 14, అనంతపురం 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, ప్రకాశం 4, గుంటూరు 3, కపడ 3, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 2, పశ్చిమ గోదావరి 2 చొప్పున మరణించారు.