10th exams: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. పోలీసుల విచారణ

ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.

10th exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. ఈ అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు భావించి, దీనికి సంబంధమున్నట్లుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

NEET UG 2022 Exam Date : నీట్ పరీక్షల తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని, అనంతరం దీనిపై పూర్తి సమాచారం అందిస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా భావిస్తున్న ప్రాంతానికి ఆళ్లగడ్డ డీఎస్పీతోపాటు, నంద్యాల డీఈఓ చేరుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగని విషయం తెలిసిందే. దీంతో రెండేళ్ల తర్వాత ప్రారంభమైన ఈ పరీక్షలు మే 6 వరకు జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు