AP CM Jagan Vidya Deevena
Jagananna Vidya Deevena : జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం జగన్ గురువారం (ఆగస్టు11,2022) బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద జగన్ ప్రభుత్వం మొత్తం రూ.11,715 కోట్ల సాయం అందించింది.
జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని చదివించవచ్చు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జగన్ ప్రభుత్వం జమ చేస్తుంది.
CM Jagan Humanity : సీఎం జగన్ గొప్ప మనసు.. కష్టంలో ఉన్న ఓ తల్లికి ఆపన్నహస్తం
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తుంది.
కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో జగన్ ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది.
Jagananna Vidya Deevena : వారి ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. విద్యాదీవెన రెండో విడత నిధులు విడుదల
గత ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో, భారీగా బకాయిలు పెట్టిన పరిస్ధితి. భోజన, వసతి ఖర్చులు దేవుడెరుగు.. ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ సైతం అరకొరగా ఇచ్చిందని అంటున్నారు.