Yoga day: విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. పాల్గొన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, లోకేశ్ .. live

విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.

11th International Yoga day: విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మందితో యోగాసనాలు వేయనున్నారు. యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుల్లో చేరనుంది. బీచ్‌ పొడవునా 3.26 లక్షల మంది పాల్గొనేలా 29 కి.మీ. మేర 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేశారు. ఆర్కే బీచ్‌ సమీపంలో ఒక్కో కంపార్టుమెంట్‌కు కేవలం 1,000 మందినే అనుమతించారు. వాటిలో శిక్షణ పొందినవారు మాత్రమే యోగాసనాలు వేస్తారు. ఉడా పార్క్‌ నుంచి భీమిలి వరకూ మిగిలిన కంపార్టుమెంట్లను రెండు రకాలుగా విభజించారు. ఒకదానిలో 672 మంది, మరోదానిలో 1,350 మంది కూర్చునేలా రూపొందించారు.