Kadapa IIIT : కడప ట్రిపుల్ ఐటీలో 12 మంది విద్యార్థులు సస్పెండ్‌

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

12 Students Suspended From Kadapa Iiit

12 students suspended from Kadapa IIIT : కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులపై యాజమాన్యం కొరడా ఝులిపించింది. 12 మంది విద్యార్ధులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం సీనియర్‌, జూనియర్‌ విద్యార్ధులు ఘర్షణపడ్డారు.

ఈ ఘటనపై స్ట్రీమ్‌ లైన్‌ కమిటి విచారణలో విద్యార్ధులు తప్పుచేసినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. తదుపరి జరగబోయే విచారణ కమిటి ముందు హాజరై ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశాన్ని కల్పించినట్లు డైరెక్టర్‌ సంధ్యారాణి తెలిపారు.