Girl Drowns: నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అక్క
చెరువులో మునిగిపోతున్న చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన అక్క అదే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. చెల్లి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
- Narender Thiru
- Published On : October 10, 2022 / 04:49 PM IST
Girl Drowns: ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటిలో కొట్టుకుపోతున్న చెల్లిని కాపాడిన అక్క, అదే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం కాశిరాజు కాశీపురంలో జరిగింది.
Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో ఉన్న ఒక చెరువులోకి తులసమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు హారిక, జాహ్నవితో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో జాహ్నవి చెరువులో జారి, నీళ్లలో మునిగిపోసాగింది. ఇది గమనించిన అక్క హారిక, చెల్లి జాహ్నవిని రక్షించేందుకు నీటిలో దూకి ఆమెను కాపాడింది. అయితే, తర్వాత హారిక కూడా నీటిలో మునిగిపోయింది. ఇది గమనించిన తులసమ్మ నీటిలో దూకి, హారికను కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఇద్దరూ నీటిలో మునిగిపోసాగారు.
వెంటనే తులసమ్మ భర్త నీటిలోకి దూకి, ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ, తులసమ్మను మాత్రమే కాపాడగలిగాడు. హారిక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు చెరువు దగ్గరికి చేరుకుని, హారిక మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టమ్ కోసం తరలించారు.
