AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు

 ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు.

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13, 292 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో 2,304 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో నలుగురు కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 280, కృష్ణా జిల్లాలో 263 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.