ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 1,775 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 34 మందికి కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 27,235కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 309 మంది మరణించారు. ప్రస్తుతం 12,533 మంది చికిత్స పొందుతున్నారు.
అనంతపురం 311, చిత్తూరు 300, తూర్పుగోదావరి 143, గుంటూరు 68, కడప 47, కృష్ణ 123, కర్నూలు 229, నెల్లూరు 76, ప్రకాశం 63, శ్రీకాకుళం 204, విశాఖ 51, విజయనగరం 76, పశ్చిమగోదావరి 84 చొపపున నమోదు అయ్యాయి.