corona cases in AP : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో 11 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,768 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 2,452 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,09,770కు చేరింది.
రాష్ట్రంలో 21,825 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 85,07,230 కరోనా సాంపుల్స్ ను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో పేర్కొంది.