Covisheild Vaccines
Covishield Vaccines : గన్నవరం ఎయిర్ పోర్టుకు 3.48 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
టీకా కేంద్రం నుంచి జిల్లాలకు అధికారులు వ్యాక్సిన్ సరఫరా చేయనున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రతతో వ్యాక్సిన్ నిల్వ చేయనున్నారు అధికారులు.