ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకించేవారంతా తుగ్లక్ లేని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములను దోచుకుని కొల్లగొట్టినవారే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు రాజధానులు అంశమే రెఫరెండం కాబోతుందని తమ్మినేని అన్నారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలను దక్కించుకోవాలని లేదా అంటూ టీడీపీకి కౌంటరిచ్చారు స్పీకర్ తమ్మినేని. నేను రాజకీయం కోసం మాట్లాడటంలేదు రాజధాని కోసమే తాను మాట్లాడుతున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
విశాఖను రాజధానిగా ప్రకటించటం వల్ల ఉత్తరాంధ్రా అభివృద్ధి జరగుతుందనీ దాన్ని వ్యతిరేకించావారంతా ఉత్తరాంధ్రా అభివృద్దిని కోరుకోనివారేనని ఆరోపించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై తమ్మినేని సెటైర్లు వేశారు.
విశాఖను రాజధాని చేస్తామంటే అచ్చెన్నాయుడు గాబరా పడుతున్నారనీ..వారు ఎటువంటి హంగామా చేసినా జరిగేది జరుగక మానదని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయటమే కాదు ప్రభుత్వం చేసిన వాటిని సమర్థించటం కూడా అలవాటు చేసుకోవాలని..రాజధాని పేరుతో భూముల్ని దోచుకుందామనుకున్నారు తప్ప మరే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని విమర్శించారు.వారి అవినీతి బైటపడుతుందని ప్రజల్ని రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు.