Chittoor Accident
Three Elephants Died : చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై అటవీ సెక్షన్ సమీపంలో జగమర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులను ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే మూడు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మృతి చెందిన మూడు ఏనుగుల్లో రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
పలమనేరు జాతీయ రహదారికి అటూ ఇటూ అడవులే.. దీంతో ఏనుగులు ఆహారం కోసం గుంపుగా అటూ ఇటూ వెళ్తుంటాయి. ఒక్కోసారి పగపూట ఏనుగుల పెద్ద గుంపు రోడ్డుపై నిలబడి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయాల్లో వాహనదారులు దూరంగానే తమ వాహనాలను నిలిపివేసి ఏనుగులు రోడ్డు దాటాక తమ ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. కానీ, నిన్న(బుధవారం) రాత్రి భూతలబండ మలుపు వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగులును చెన్నైకి చెందిన కూరగాయల లోడ్ తో వెళ్తున్న వెహికిల్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.
BRS : లోక్ సభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు
వీటిలో ఒక పెద్ద మగ ఏనుగు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. ఆ వెహికల్ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరార్ అయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై రెండు వైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. చిత్తూరు డీఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి ఘటనస్థలికి చేరుకుని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.
ప్రమాదం జరిగిన జాతీయ రహదారిపై గంటకు 40 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో వాహనాలు నడుపు రాదంటూ ఇదివరకే అటవీ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు. ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది. ఒక పెద్ద ఏనుగు రోడ్డుకు అవతల పడి మరణించగా, రెండు చిన్న ఏనుగులు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన క్రాష్ బారియర్స్ కు తగిలి మృతి చెందాయి.
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. అర్థరాత్రి లఖిత అనే విద్యార్థిని మృతి
రోడ్డు ప్రమాదంలో మరణించిన మూడు ఏనుగులకు మరి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అడవి ప్రాంతంలో మూడు ఏనుగులను అటవీ సిబ్బంది ఖననం చేయనుంది. మరణించిన ఏనుగులను వెతుక్కుంటూ ఏనుగుల మంద వస్తుందని భయపడుతున్న అటవీ అధికారులు…త్వరగా కార్యక్రమం ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.