Kidnap in Tirumala: బాలుడు సేఫ్.. తిరుమలలో కిడ్నాప్ కథ సుఖాంతం

తిరుమలలో 4 రోజుల క్రితం.. గోవర్ధన్ అనే నాలుగేళ్ల వయసున్న బాబు కిడ్నాప్ అయిన ఘటన.. సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన యువతి తల్లిదండ్రులే.. బాబును తిరుమల చేర్చారు.

Kidnap in Tirumala: బాలుడు సేఫ్.. తిరుమలలో కిడ్నాప్ కథ సుఖాంతం

Tirumala Boy

Updated On : May 5, 2022 / 9:50 AM IST

Kidnap in Tirumala: తిరుమలలో 4 రోజుల క్రితం.. గోవర్ధన్ అనే నాలుగేళ్ల వయసున్న బాబు కిడ్నాప్ అయిన ఘటన.. సుఖాంతమైంది. బాలుడిని అపహరించిన పవిత్ర అనే యువతి.. నేరుగా తన ఊరు మైసూరుకు వెళ్లింది. అప్పటి నుంచి ఆ బాబు ఆచూకీ తెలియక.. బాధిత కుటుంబం తీవ్రంగా తల్లడిల్లింది. ఘటనపై.. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా విషయాన్ని గ్రహించారు. ఓ యువతి బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయాన్ని నిర్థారించారు. వాళ్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.

కిడ్నాప్ జరిగిన 4 రోజుల తర్వాత.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మైసూరు నుంచి పవిత్రతో పాటు, బాబును వెంటబెట్టుకుని.. పవిత్ర తల్లిదండ్రులు తిరుమల చేరుకున్నారు. బాబును తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి అప్పగించారు. తమ కుమార్తె మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పారు. అందుకే.. బాబును వెంట తీసుకుని మైసూరుకు వచ్చిందన్నారు. తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం ఒంటరిగా వెళ్లిన పవిత్ర.. బాలుడిని మైసూరు తీసుకురావడం చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. తిరిగి క్షేమంగా అప్పగించేందుకే బాబుతో పాటు తాము తిరుమల వచ్చామని వివరించారు.

ఇక.. కిడ్నాప్ (Kidnap in Tirumala) విషయం తెలిసిన వెంటనే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా విస్తృత దర్యాప్తు చేశారు. పవిత్ర.. గోవర్ధన్ ను వెంట తీసుకున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయి. బాలుడు కిడ్నాప్ అయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. ఇదే సమయంలో.. పవిత్ర తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై.. తిరుమలకు బాబును తీసుకురావడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాలుగేళ్ల తమ బాబు.. తిరిగి క్షేమంగా తిరుమల చేరడంపై.. బాధిత కుటుంబీకులు సైతం ఆనందంతో.. భావోద్వేగానికి గురయ్యారు.

Read More:

Boy Kidnap: తిరుమలలో కిడ్నాపైన బాలుడు గోవర్ధన్ కోసం కొనసాగుతున్న గాలింపు