Boy Kidnap: తిరుమలలో కిడ్నాపైన బాలుడు గోవర్ధన్ కోసం కొనసాగుతున్న గాలింపు

బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు

Boy Kidnap: తిరుమలలో కిడ్నాపైన బాలుడు గోవర్ధన్ కోసం కొనసాగుతున్న గాలింపు

Boy

Updated On : May 3, 2022 / 3:02 PM IST

Boy Kidnap: తిరుమల కొండపై ఇటీవల అపహరణకు గురైన బాలుడు గోవర్ధన్ రాయల్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు. శనివారం సాయంత్రం తిరుమల కొండపై బాలుడిని కిడ్నప్ చేసిన అనంతరం సదరు మహిళ తిరుపతి బస్ స్టాండ్ లో దిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు పోలీసులు. సోమవారం ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ చేరుకున్న మహిళా కిడ్నాపర్..ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్లు పోలీసులు భావించారు. దీంతో కడప, నెల్లూరు జిల్లాలో సచివాలయ ఇన్చార్జిల ద్వారా వాలంటీర్లకు.. కిడ్నాపర్, బాలుడి ఫోటోలు తదితర వివరాలు పంపించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.

Also read:Porn Clip Disrupts: కేంద్ర మంత్రి సమక్షంలో ఇండియన్ ఆయిల్ వేడుకలో ‘పోర్న్ వీడియో’

కిడ్నాపర్ ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించారు. మరోవైపు కిడ్నాపర్ తిరుపతికి ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు, తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో స్పష్టత లేకపోవడంతో విచారణపై ముందుకు వెళ్లలేక పోతున్నారు పోలీసులు. శ్రీవారి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే సమయంలో కిడ్నాపర్…మహిళా క్షురకురాలితో తెలుగులో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి రైల్వే స్టేషన్ లోనూ టికెట్ తీసుకున్న సమయంలో కిడ్నాపర్ లేడి తెలుగులో మాట్లాడినట్లు పోలీసు విచారణలో తేలింది.

Also read:Rahul Gandhi: నేపాల్ పబ్‌లో రాహుల్ గాంధీ ఖుషీ ఖుషీ: దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు