Puncher Shop : పంచర్ షాప్ కు రూ.57 వేల కరెంట్ బిల్

కర్నూలు జిల్లా ఆదోనిలో బసవ అనే వ్యక్తికి పంచర్ షాప్ ఉంది. ఆ పంచర్ షాప్ కి విద్యుత్ సిబ్బంది ఏకంగా రూ.57,965 బిల్ వేశారు.

Puncher Shop

Puncher Shop :  కర్నూలు జిల్లా ఆదోనిలో బసవ అనే వ్యక్తికి పంచర్ షాప్ ఉంది. ఆ పంచర్ షాప్ కి విద్యుత్ సిబ్బంది ఏకంగా రూ.57,965 బిల్ వేశారు. ఆ బిల్ చూసిన బసవ కంగుతిన్నాడు. ఇంతపెద్దమొత్తంలో బిల్ తాను ఎలా కట్టాలని, తన ఆదాయం రోజుకు రెండు వందలు కూడా ఉండదని, అయినా ఓ బల్బ్, ఓ మోటర్ కు ఇంత బిల్ ఎలా వేస్తారని వాపోయాడు. స్థానికుల సాయంతో తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పొరపాటున జరిగిందని సరిచేస్తామని తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇటువంటి పొరపాట్లు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి.

 

Read More : Vetrimaaran : నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..!