Accident
West godavari: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు వంతెన పైనుంచి వాగులో పడగా.. ఈ ఘటనలో డ్రైవర్ సహా 9మంది మృతి చెందారు.
అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.