snake in liquor bottle
Snake In Liquor Bottle : గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల రావడం స్థానికంగా కలకలం రేపింది. పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు…. బాపట్ల బస్టాండ్‌లోని ప్రభుత్వ మద్యం షాప్‌లో ఫుల్‌బాటిల్ కొనుగోలు చేశారు. అయితే బాటిల్‌ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల్ల అందులో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన యువకులు….. దాన్ని వీడియో తీశారు. అనంతరం ఇతరులకు తెలియజేశారు.
యువకులు వెంటనే సదరు వైన్ షాపు వద్దకు వెళ్లి అసలు విషయాన్ని చెప్పారు. తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ బదులు వేరే బాటిల్ ఇవ్వమని కోరగా అందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో యువకులు షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Snake in Liquor Bottle: మద్యం బాటిల్ లో పాముపిల్ల..చూడకుండా తాగేసిన మందుబాబు..!
తర్వాత షాపు యజమాన్యం రాజీకి వచ్చింది. మరో ముందు మద్యం బాటిల్ ను ఇచ్చి యువకులను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పొన్నూరులో మందుబాబులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.