Attack On Constable : మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

మద్దెల కృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు యత్నింగా పోలీసులతో అతడు వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

Attack

man attacked constable : కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో కానిస్టేబుల్ పై మందుబాబు దాడికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి మద్యం సేవించి అత్తగారింట అల్లరి చేస్తున్నాడని డయల్ 100కు కాల్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు.

అక్కడ మద్దెల కృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు యత్నింగా పోలీసులతో అతడు వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కృష్ణ ఆగ్రహంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై ఇటుక రాయితో దాడి చేశారు.

High Court : సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

దీంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ ఆదేశాలతో కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.