A road accident at Badwell in Kadapa district : కడప జిల్లా బద్వేల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు భవనాన్ని ఢీకొట్టింది. దీంతో స్టీరింగ్, సీటు మధ్య డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ ను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.