Ponnavolu Sudhakar Reddy Allegations
Ponnavolu Sudhakar Reddy – ACB Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. లంచ్ తర్వాత విచారణ జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. 370 కోట్ల నిధులకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించారు.
ఈ నిధుల నుంచి టీడీపీ ఖాతాలోకి నేరుగా రూ.27 కోట్లు మళ్లించారని చెప్పిన పొన్నవోలు బ్యాంకు ఖాతాల డాక్యమెంట్లు కోర్టు ముందు ఉంచారు. డొల్ల కంపెనీలు సృష్టించి హవాలా రూపంలోనూ నిధులు మళ్లించారని పొన్నవోలు వాదించారు.
Also Read..Janasena: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు..
నైపుణ్య శిక్షణ పేరుతో రూ.370 కోట్ల నిధులను డొల్ల కంపెనీలకు తరలించారు. చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పిస్తున్నాం. ఏ రకంగా డొల్ల కంపెనీ నుంచి ఈ నిధులు నేరుగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయి అన్నదానిపై ఆధారాలు కోర్టుకి సమర్పిస్తున్నాం. 27 కోట్ల రూపాయల నిధులను మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను ఏసీబీ కోర్టుకు సమర్పిస్తున్నాం. దీనికి సంబంధించిన ఆడిటర్ ను విచారణకు పిలిచాం. ఈ నెల 10వ తేదీన ఆడిటర్ విచారణకు వస్తానన్నారు. డొల్ల కంపెనీలు సృష్టించి హవాలా రూపంలో నిధులు దారి మళ్ళించారు.
Also Read..Pawan Kalyan: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?
చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు..
చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదు. స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే చంద్రబాబు పాత్ర పూర్తయింది. బ్యాంక్ గ్యారంటీలను స్కిల్ కార్పొరేషన్ కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. సిమెన్స్ తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పొరేషన్ తప్ప ప్రభుత్వం కాదు.
స్కిల్ కార్పొరేషన్, సిమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టు కాదు.
ఏఏజీ హోదాలో ఉన్న మీరు ఒక వ్యక్తిని నిందితుడు అంటూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. నిందితుడా కాదా అనేది తేల్చేందుకు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ ఉంది. నిందితుడు అని చెప్పడానికి మీరెవరు?
టీడీపీకి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు ఇచ్చారు. బ్యాంక్ లావాదేవీల కాపీ ఇపుడు డౌన్ లోడ్ చేసినది కాదు. ఈ ఏడాది ఏప్రిల్ లో బ్యాంక్ లావాదేవీలు కాపీ డౌన్ లోడ్ చేసినది. ఆ కాపీ మీద తేదీ, సమయం ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొత్త విషయం ఏమీ లేదు. ప్రతి ఏటా ఎలక్షన్ కమిషన్ కి ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కాపీలను ఇస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు అభ్యంతరం తెలుపలేదు. పార్టీకి సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు అని కూడా ప్రజాప్రతినిధులు చట్టం ఒక్కటి ఉంటుంది. వాటిని వారు చూసుకుంటారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా టీడీపీ ఎకౌంట్ కి నిధులు వెళ్లినట్లు సీఐడీ నిరూపించలేకపోయింది.