Aarogyasri Services: ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్..! ఎప్పటి నుంచి, ఎందుకు అంటే..
బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Naveen
- Published On : March 26, 2026 / 08:13 PM IST
Aarogyasri Services: ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ-ASHA) ప్రకటన చేసింది. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపింది. 3 వేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆశ మండిపడింది. బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
