ACB Raids : వుడా ఆఫీసర్ శోభన్ బాబు ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం, వెలుగులోకి అక్రమాస్తులు

విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్దనపు శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు.

ACB Raids : విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వుడా ప్లానింగ్ ఆఫీసర్ వర్దనపు శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే శోభన్ బాబు ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. శోభన్ బాబు అక్రమాస్తులపై అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. భీమవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని శోభన్ బాబు బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేశారు.

శోభన్ బాబు ఇంట్లో జరిపిన సోదాల్లో 8లక్షల రూపాయలకు పైగా నగదు, భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజయనగరం, విశాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహించిన శోభన్ బాబు అవినీతి బాగోతం ఏసీబీ నిఘాతో బట్టబయలైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విశాఖలో ఏసీబీ చేతికి అవినీతి తిమింగలం చిక్కింది. శోభన్ బాబు పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు, భవనాలు, బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు అధికారులు. అరిలోవ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే మరింత బంగారం, నగదు, కీలక డాక్యుమెంట్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఏసీబీ అధికారులు.