Visakhapatnam: విశాఖ రైల్వే స్టేష‌న్‌లో తప్పిన ప్రమాదం.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన..

తాజా ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ తీగతలను సరిచేసి ..

Visakhapatnam Railway Station

Visakhapatnam Railway Station: ఆదివారం తెల్లవారు జామున విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమబెంగాల్ లోని పురులియాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చింది. తెల్లవారు జామున 5.20 గంటల సమయంలో స్టేషన్ కు చేరుకోగా.. రైల్వే సిబ్బంది రైలు ఇంజిన్ ను మార్పు చేశారు. ఆ తరువాత.. తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైనఉన్న విద్యుత్ తీగలను కొంతదూరం వరకూ ఈడ్చుకెళ్లింది.

Also Read: Gossip Garage : తన వారసుడిగా తమ్ముడిని తెరమీదకు తెచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..! కారణం అదేనా?

రైల్వే సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే పెను ప్రమాదం సంభవించేదని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ తీగలను సరిచేసి మళ్లీ రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. అయితే, ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.