నందమూరి నటసింహం బాలయ్య బాబు రూలర్ మూవీలో చెప్పిన పొలిటికల్ పంచ్ డైలాగ్ బాగా పేలింది. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ అవుతోంది. మాములుగా బాలయ్య ఏ డైలాగ్ చెప్పినా అది తిరుగుండదు. బాలయ్య తన ప్రతి సినిమాలో భారీ డైలాగ్ లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏదో ఒక ప్రయోగం చేస్తుంటునే ఉంటారు. అది పొలిటికల్ కావొచ్చు.. ఫ్యాక్షన్ ఒరియెంటెడ్ మూవీ కావొచ్చు.. మూవీ ఏదైనా తనదైన శైలిలో డైలాగ్‌లు చెప్పడం ఒక్క బాలయ్యకే సాధ్యమనేది అందరికి తెలిసిందే.
అలాంటిది బాలయ్య బాబు.. పొలిటికల్ డైలాగ్ చెప్పడంతో ఆ డైలాగే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు అందరి నోటా బాలయ్య పొలిటికల్ డైలాగే వినిపిస్తోంది. ప్రతి సినిమాలో ఒకటో రెండో పవర్ ఫుల్ భారీ డైలాగ్‌లు ఉంటాయి. నిజానికి బాలయ్య తన సినిమాలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ వాడటం చాలా కామన్.
అప్పుడు లెజెండ్.. ఇప్పుడు రూలర్ :
రాబోయే రూలర్ కొత్త మూవీలోనూ పొలిటికల్ డైలాగ్ ఒకటి మళ్లీ పేల్చాడు బాలయ్య. ఎక్కడ చూసినా.. విన్నా అందరూ బాలకృష్ణ రూలర్ డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ పొలిటికల్ పంచ్ డైలాగ్ ఎవరినుద్దేశించి వేశాడన్నది పెద్ద చర్చనీయాంశమైంది. తన సినిమాల్లో కావాలనే డైలాగ్ చెబుతాడో లేదా స్టోరీ డిమాండ్ చేస్తుందో తెలియదు గానీ.. ప్రస్తుత రాజకీయ అంశాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయేలా బాలయ్య పంచ్ డైలాగ్ ఉంది.
లెజెండ్ మూవీలో ‘సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ.. విలన్‌ను ఉద్దేశించి బాలయ్య చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది కూడా. కానీ, బాలయ్య అసెంబ్లీ డైలాగ్ చెప్పింది.. జగన్ గురించే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు రూలర్ మూవీతో బాలయ్య మళ్లీ అదే తరహాలో పొలిటికల్ పంచ్ విసిరాడు.
రూలర్ లేటెస్ట్ ట్రైలర్‌లో.. పొలిటికల్ పవర్ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకుంటున్నావా.. చచ్చే వరకు నీతో ఉంటుందనుకోవడానికి.. అంటూ చెప్పిన డైలాగ్‌పై.. అంతకుమించిన డిబేట్ నడుస్తోంది. బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా టీడీపీపై వేసిన సెటైరేనని చెబుతున్నారు. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్.. ఎవరిని ఉద్దేశించి వేశాడన్న కాస్తా కన్ఫూజన్ మారింది. ఈ డైలాగ్ వెనుక ఉద్దేశం ఏంటి అనేదానిపైనే చర్చ జరుగుతోంది.
ఎవరినుద్దేశించి..? బాలయ్య డైలాగ్ :
కొన్నిరోజులుగా బాలయ్య రూలర్ పొలిటికల్ డైలాగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. బాలయ్య డైలాగ్ దెబ్బకు ఏపీ పాలిటికల్స్ ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఇంతకీ బాలయ్య బాబు.. ఈ డైలాగ్ వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించిందా లేక టీడీపీ అధినేత, బావ అయిన చంద్రబాబుపైనే సెటైర్ వేశారా అన్నది.. ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇది… జగన్ పైనే వేసిన సెటైర్ అని కొందరు అంటుంటే.. మరికొందరు.. చంద్రబాబుపైనే సెటైర్ అంటున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదుగానీ బాలయ్య డైలాగ్ మాత్రం ఏపీలో పొలిటికల్ సెగ రాజేసిందని మాత్రం చెప్పవచ్చు.
డైలాగ్ వెనుక అసలు స్టోరీ ఇదేనా? :
బాలయ్య మూవీ డైలాగ్‌కు.. రాజకీయాలకు సంబంధం ఏంటి అనుకునేవారు లేకపోలేదు. గతంలో కూడా బాలయ్య మూవీ డైలాగ్ లకు రాజీయాలను ఆపాదిస్తూ రకరకాల ప్రచారాలు కొనసాగాయి. అందుకే రూలర్ మూవీకి కూడా అదే స్థాయిలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి ప్రచారాలు జరగడం వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఏ రేంజ్‌లో హీట్ పుట్టించాయో రాష్ట్రమంతా చూసింది. చంద్రబాబును.. వైసీపీ ఎలా టార్గెట్ చేసిందో అంతా లైవ్‌లో చూశారు. బావ చంద్రబాబుపై.. వైసీపీ ఎమ్మెల్యేలంతా వరుసపెట్టి విమర్శలు గుప్పిస్తుంటే.. బాలయ్య మాత్రం అసెంబ్లీకి అటెండెన్స్ కోసం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.
అసెంబ్లీ గేటు ముందు మార్షల్స్ వారిని అడ్డుకున్న రోజు కూడా బాలయ్య బాబు అక్కడ లేడు. ఇక.. రివర్స్ టెండరింగ్‌ను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలంతా.. అసెంబ్లీకి రివర్స్‌లో నడచుకుంటూ వెళ్లారు. కనీసం ఈ నిరసన కార్యక్రమానికైనా బాలయ్య హాజరుకాలేదు. ఇవన్నీ చూస్తుంటే బాలయ్య పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే రాజకీయా పరిణామలను ఊహించి బాలయ్య ముందే ఈ డైలాగ్ చెప్పాడంటున్నారు. ఏదిఏమైనా బాలయ్య పొలిటికల పంచ్ మాత్రం బాగా పేలిందనడంలో సందేహం అక్కర్లేదు.