Adala Prabhakar Reddy : ఆపరేషన్ నెల్లూరు.. కోటంరెడ్డికి జగన్ షాక్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్‌గా ఆదాల

ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి.. వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.

Adala Prabhakar Reddy : ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి.. వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నెల్లూరు రూరల్ ఇంచార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించారు జగన్. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు గ్రామీన నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేందుకే ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ క్యాడర్ లో ఎలాంటి గందరగోళం లేదన్నారు సజ్జల.

Also Read..Phone Tapping In YCP : ముగ్గురు వచ్చారు,వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు : అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు

కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేసింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన స్నేహితుడితో పర్సనల్ గా మాట్లాడిన ఆడియో కాల్ కు సంబంధించిన విషయాలను ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు తనతో ప్రస్తావించారని చెప్పారు. తన కాల్ ట్యాప్ చేయకుండానే ఆ విషయాలు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. కాల్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలిసి మనస్తాపానికి గురయ్యానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి చెప్పారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కోటంరెడ్డి చేసిన ఆరోపణలు వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. కోటంరెడ్డి ఆరోపణలపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రంగా స్పందించారు. కోటంరెడ్డిపై ఎదురుదాడికి దిగారు. పేర్ని నాని, బాలినేని, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు కోటంరెడ్డి ఆరోపణలను తప్పుపట్టారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డ్ ను లీక్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి.. ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడం తప్ప వేరే పని లేదా అని ప్రశ్నించారు. టీడీపీలో చేరదామని ఫిక్స్ అయిన తర్వాతే సానుభూతి కోసం ఇలా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని కోటంరెడ్డిపై మండిపడ్డారు.

Also Read..Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

నెల్లూరు జిల్లాలో ఈ వివాదం ముదురుతుండటంతో ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టారు. సజ్జల, ఇతర వైసీపీ నేతలతో సమావేశం అనంతరం కోటంరెడ్డిపై వేటు వేశారు. రూరల్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆదాలకు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్.

ట్రెండింగ్ వార్తలు