Visakha Adulterated Ghee: విశాఖలో కల్తీ నెయ్యి కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. 120 కిలోల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, క్యాటరింగ్ ఏజెన్సీలు, బేకరీలు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు తెలిపారు.
”వనస్పతి ఆయిల్, కెమికల్స్, క్రీమ్, కలర్స్.. ఈ మూడింటిని మిక్స్ చేసి నెయ్యిని తయారు చేస్తున్నారు. కేజీ 350 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే నూటికి నూరు శాతం ఇది కల్తీ నెయ్యి. అరిలోవా, మధురవాడ, అనకాపల్లి, సింహాచలం, పెందుర్తి.. రూరల్ ఏరియాస్ లో క్యాటరింగ్ చేసే వారికి 350 రూపాయలకు కేజీ నెయ్యి విక్రయిస్తున్నారు.
ఇలాంటి కల్తీ నెయ్యి తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఠా సభ్యులు బళ్లారి నుంచి విశాఖకు వచ్చి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఏడాది నుంచి కల్తీ నెయ్యి తయారీ దందా కొనసాగుతోంది. ఈ కల్తీ నెయ్యి వినియోగం ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరం. విశాఖలోని విశ్రాంత్ లాడ్జిలో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. బెంగళూరు నుంచి పదార్ధాలు తెప్పించారు” అని అధికారులు తెలిపారు.
”ఈ కల్తీ నెయ్యి చూసేందుకు అచ్చం ఒరిజినల్ నెయ్యిలా ఉంటుంది. అది కల్తీ నెయ్యి అని కనుక్కోవడం చాలా కష్టం. ఇలాంటి నెయ్యి తినడం ఆరోగ్యానికి చాలా హానికరంగా. పలు రకాల జబ్బుల బారిన పడతారు” అని అధికారులు వెల్లడించారు.
Also Read: గుడ్‌న్యూస్.. జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్.. పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయ్..