Milk Prices Reduced: గుడ్‌న్యూస్.. జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్.. పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయ్..
Milk Prices Reduced: రాష్ట్రంలో పాల ధరలు తగ్గనున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

milk products
Milk Prices Reduced: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో పాల ధరలు తగ్గనున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. పన్నీరు, వెన్న, నెయ్యి వంటి ఇతర పాల ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ఆయా డెయిరీలు ప్రకటించాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కీలక మార్పులు తీసుకొచ్చింది. కేవలం రెండు స్లాబులకే జీఎస్టీలను పరిమితం చేసింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా 5శాతం స్లాబు పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే సబ్బులు, షాంపులు, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తూ ఆయా కంపెనీలు ప్రకటించాయి. అయితే, తగ్గిన ధరలు ఈనెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
కేంద్రం జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏపీలో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గబోతున్నాయి. సంగం డెయిరీ, విజయ డెయిరీలు ధరలు తగ్గించాయి. జీఎస్టీ తగ్గడంతో డెయిరీలో ధరలను తగ్గించాయి. ఈ మేరకు విజయ డెయిరీ లీటరు పాలపై రూ.5 వరకు తగ్గించింది. అదేవిధంగా పన్నీరు, వెన్న, నెయ్యి ధరలను కూడా తగ్గించింది. సంగం డెయిరీ కూడా పాల ఉత్పత్తుల ధరలను తగ్గించింది.
జీఎస్టీ తగ్గడంతో సంగం డెయిరీ, విజయ డెయిరీలు ధరలను తగ్గించాయి. విజయ (టెట్రా) పాలు లీటరుపై రూ.5, పన్నీరు కిలో రూ.20, వెన్న కిలో రూ.30, నెయ్యి కిలో రూ.30, ప్లైవర్డ్ మిల్క్ లీటరుపై రూ.5 వరకు తగ్గించినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. తగ్గించిన ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
సంగం డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయి. డెయిరీ ఎండీ గోపాల్ కృష్ణన్ మాట్లాడుతూ.. యూహెచ్‌టీ పాలు లీటరుపై రూ.2, పన్నీరు కిలో రూ.15, నెయ్యి కిలో రూ.30, వెన్న కిలో రూ.30, మిల్క్ షేక్ లు లీటరు రూ.5, బేకరీ ప్రొడక్టుల కిలోపై రూ.20 తగ్గించినట్లు చెప్పారు.