N Chandrababu Naidu : తెలంగాణలో అక్కడ ఎకరం రూ.30 కోట్లు, ఏపీలో ఇలాంటి ధరలు ఎక్కడున్నాయి?- చంద్రబాబు నాయుడు

N Chandrababu Naidu : వైసీపీ నేతల బట్టలిప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.

N Chandrababu Naidu(Photo : Google)

N Chandrababu Naidu – YS Jagan : నేను సైకోలకు భయపడను అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సైకోలకు భయపడను, అందరి సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చారు. నేను క్లైమోర్ బాంబులకే బెదరలేదు.. ఈ సైకోలు ఓ లెక్క అని చంద్రబాబు అన్నారు. ముఠాలను మట్టిలో కలిపేశా.. ఈ సైకోలు.. రౌడీలు ఏం చేస్తారు..? అని నిప్పులు చెరిగారు.

మద్యం, మట్టి, గనులు.. ప్రతి దాంట్లో దోపిడీనే..
”లులును విశాఖ నుంచి తరిమేశారు. అమర్ రాజా సంస్థను ఇబ్బందులు పెట్టినా.. చిత్తూరు జిల్లా వాళ్లెవరూ స్పందించ లేదు. అమర్ రాజా సంస్థను మేమే పంపించేశామని సజ్జల చెప్పారు. ఎంత కొవ్వెక్కితే అలా మాట్లాడతారు.. వీళ్లు మనుషులా..? గనులను వైసీపీ నేతలే తీసేసుకున్నారు. దోపిడీ అంటే ఏంటో జగన్ కు తెలియదంట. పాపం.. జగన్ ఏమీ తెలియని అమాయకుడు. మద్యం, మట్టి, గనులు ఇలా ప్రతి దాంట్లో దోపిడీనే. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు పని చేయడం లేదు. దొంగలను కాపాడేలా పోలీసులు పని చేస్తున్నారు.(N Chandrababu Naidu)

Also Read.. Pawan kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జగన్‌లో డిప్రషన్, అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది : గాదె వెంకటేశ్వరరావు

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి. జగన్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం గెలిచినట్టు. శ్రీకాళహస్తిలో ఇప్పుడున్న దారుణ పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలోని నేతలే కాదు వైసీపీలోని చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయి.

ఆడపిల్లలపై అకృత్యాలు పెరిగాయి..
ఏపీలో విద్యా వ్యవస్థ కుప్పకూలింది. అమ్మఒడి విషయంలో జగన్ చెప్పేవన్నీ అబద్దాలే. ఇచ్చిమ హామీలేవీ పూర్తి స్థాయిలో నేరవేర్చ లేదు. విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఓ సైకో ఊరికో సైకోను తయారు చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వులస పిల్ల మాదిరి ఎగిరిగెరి పడుతున్నాడు. ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అక్కను వేధిస్తున్నారని తమ్ముడు ప్రశ్నిస్తే.. పెట్రోల్ పోసి చంపేశారు.
ఆడపిల్లలపై అకృత్యాలు పెరిగాయి.(N Chandrababu Naidu)

నరకం అంటే ఏంటో ఈ నాలుగేళ్లల్లో చూపించాడు..
నరకం అంటే ఏంటో ఈ నాలుగేళ్లల్లో జగన్ చూపించాడు. దేశంలోనే ధనికుడైన పెత్తందారు జగన్.. కానీ తాను పేదోడిని అంటాడు. ప్రజలకు కర్రు కాల్చి వాతలు పెట్టి.. మీ బిడ్డను నాకు ఓట్లేయండి అంటున్నాడు. జగన్ కు మళ్లీ ఓట్లేస్తే వాతలు పెడతాడు. పేదలను దోచేస్తూ.. వారిని నాశనం చేస్తూ పేదల పక్షం అని చెప్పుకోవడం జగన్ కే చెల్లింది. కళ్లు మూయకుండా అబద్దాలు ఆడడం జగనుకే సాధ్యం. రాష్ట్రంలో సంపదంతా తన వద్దే ఉండాలి.. అందరూ తనకు బానిసలుగా ఉండాలనే మనస్తత్వం జగన్ ది.

Also Read..Bojjala Sudhir Reddy : ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక 6నెలలు మమ్మల్ని వదిలేయండి

ధైర్యంగా రాజకీయం చేస్తాననే జగన్.. పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఆడొళ్లని కూడా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. సజ్జల ఓ ఇడియట్.. సైకోలా వ్యవహరిస్తున్నాడు. ప్రజా వేదికను కూల్చేసి నాలుగేళ్లు. శిధిలాలు కూడా తీయలేదు.

టీడీపీ ఓడాక భూముల విలువలు పడిపోయాయి..
ఏపీలో టీడీపీ ఓడిపోయాక భూముల విలువలు పడిపోయాయి. తెలంగాణ పఠాన్ చెరులో ఎకరం రూ.30 కోట్లు ఉంది. ఏపీలో ఇలాంటి ధరలు ఎక్కడున్నాయి. అనంతలో కియా వచ్చింది.. ధరలు పెరిగాయి. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. వైసీపీ నేతలకు బట్టలిప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి. చాలా మంది పోలీసుల్లో మార్పు వచ్చింది. ఇంకా కొందరు పోలీసులు మారాలి. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే జరిగే నష్టం ఏంటో 22A భూముల్లో జరుగుతున్న దోపిడీ చూస్తే అర్థమవుతుంది” అని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు