అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ వరప్రసాదరావు మృతి

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కౌంటర్‌ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్లోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు డాక్టర్లు కన్ఫార్మ్ చేశారు.

వరప్రసాదరావు దగ్గర లభించిన వివరాల ఆధారంగా గోపాలపురం పోలీసులు హైదరాబాద్‌ లోని మృతుని బంధువులకు సమాచారం అందించారు.బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరప్రసాదరావు స్వస్థలం విజయవాడ. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఎం.నిరంజన్‌ రెడ్డి తెలిపారు.