Ali : అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు.. స్పందించిన అలీ!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ కూతురి వివాహం ఘనంగా ఈ ఆదివారం రాత్రి జరిగింది. తన కూతురు పెళ్ళికి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి శుభలేఖను అందించిన విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి గాని, రిసెప్షన్ వేడుకకు గాని హాజరు కాకపోవడంతో.. అనేక చర్చలకు దారి తీస్తుంది. తాజాగా ఈ విషయంపై అలీ స్పందించాడు..
- gum 95921
- Published On : December 1, 2022 / 09:51 PM IST
Ali clarifies why pawan kalyan didn't attend his daughter marriage
Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ కూతురి వివాహం ఘనంగా ఈ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి, నాగార్జున, అమల, రోజాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అలీ భార్య జుబేదా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.
Prabhas : ప్రభాస్, మారుతి సినిమా కోసం థియేటర్‌పై 10 కోట్లు ఖర్చు.. ఏంటి విషయం?
కాగా అలీ.. తన కూతురు పెళ్ళికి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి శుభలేఖను అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన రిసెప్షన్ కి సీఎం జగన్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పెళ్ళికి గాని, రిసెప్షన్ వేడుకకు గాని హాజరు కాకపోవడంతో.. అనేక చర్చలకు దారి తీస్తుంది.
తాజాగా ఈ విషయంపై అలీ స్పందించాడు.. “పవన్ కళ్యాణ్ గారికి శుభలేఖ ఇవ్వడం జరిగింది. అయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు. ఆ క్రమంలోనే అయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారు. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అయన ఫోన్ లో మాట్లాడారు. వధూవరులు ఇద్దరు ఇంటిలో ఉన్నప్పుడు చెప్పు, నేను ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పారు” అంటూ వెల్లడించారు.
