Prabhas : ప్రభాస్, మారుతి సినిమా కోసం థియేటర్‌పై 10 కోట్లు ఖర్చు.. ఏంటి విషయం?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కుతున్న...

Prabhas : ప్రభాస్, మారుతి సినిమా కోసం థియేటర్‌పై 10 కోట్లు ఖర్చు.. ఏంటి విషయం?

Director Maruthi investing 10crore for theater set

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించనున్నట్లు తెలుస్తుంది. హై బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

Mayabazar – Premadesam : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మాయాబజార్, ప్రేమదేశం సినిమాలు..

కాగా ఈ సినిమా కోసం మారుతి ఒక థియేటర్ సెట్ వేయబోతున్నాడట. సినిమా కథ మొత్తం వాడుకులో లేని ఒక పాత థియేటర్ చుట్టూ తిరుగుతుంది అంటా. దీంతో చిత్ర యూనిట్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఒక థియేటర్ సెట్ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ‘ప్రేమకథా చిత్రం’ వంటి సక్సెస్ ఫుల్ హారర్ కామెడీ తీసిన అనుభవం ఉన్న మారుతి.. ప్రభాస్ కూడా మంచి హిట్ ని అందించగలడో చూడాలి.

కాగా ప్రభాస్ సలార్ షూటింగ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్రాఫిక్స్ విషయంలో బాగా ట్రోలింగ్ గురవ్వడంతో, ఆదిపురుష్ మళ్ళీ రీ వర్క్ చేయడానికి వెనక్కి వెళ్ళింది. దీంతో ప్రభాస్ ఆ సినిమా లేటుని సలార్ తో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు నటిస్తున్నారు,