Potti Sriramulu : స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. రేపే ప్రారంభం..
పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మార్చ్ 16 సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. (Potti Sriramulu)
- Saketh U
- Published On : March 15, 2026 / 04:53 PM IST
Statue of Sacrifice
Potti Sriramulu : ఏపీ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మార్చ్ 16 సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఆంద్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళిగా, ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్నిఆవిష్కరిస్తున్నారు. అమరావతిలో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ శాాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల ఎత్తు మేర అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
Also Read : Tamilnadu : తమిళనాడుపై బీజేపీ గురి.. టీవీకే విజయ్‌కు భారీ ఆఫర్? తెరపైకి పవన్ కల్యాణ్ పేరు..!
సోమవారం మార్చ్ 16 ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. శంకుస్థాపన జరిగిన 6 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ విగ్రహాన్ని పూర్తిచేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. తెలుగు వారందరికీ ఇది గర్వకారణమైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మేనేజింగ్ ట్రస్టీ, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ డూండి రాకేశ్ కోరారు.
Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
