రాష్ట్రపతిని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలు: కేంద్రం జోక్యం చేసుకోవాలని మీరున్నా చెప్పండి

  • Publish Date - February 7, 2020 / 05:52 AM IST

రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం..ఎడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖేననే దృక్పధంతోనే ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. 

ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు గత వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉండి ఎట్టకేలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 7,2020)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. అమరావతిలో గత 52 నుంచి కొనసాగుతున్న ఆందోళనలకు..తమ డిమాండ్స్ ను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చొరవ తీసుకోవాలని నేతలు కోరారు.

రాజధాని విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్రపతికి వివరించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని దానికి సంబంధించి కేంద్రానికి రాష్ట్రపతి సూచించాలని కోరారు.