లోకేష్ ట్వీట్ : సభలో జగన్‌కు ఎలా నిద్ర పడుతోంది ? 

  • Publish Date - January 20, 2020 / 11:00 AM IST

ఏపీ రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే..మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే… ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది? అంటూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. 

2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. 

దీనిపై ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశారు నారా లోకేష్. సీఎం జగన్ ఒక చేతగాని దద్దమ్మ అని వైకాపా మంత్రులు, శాసనసభ్యులే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలన్నారు. 

Read More : ప్రభుత్వంపై రాపాక ప్రశంసలు : చప్పట్లు కొట్టిన జగన్

8 నెలల నుండి ఏమీ పీకలేని వాళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ గాలి పోగేసి పాత పాటే పాడుతున్నారని విమర్శించారు. రాజధానికి సంబంధం లేని భూములు కూడా ఇన్ సైడర్ అంటూ విచారణ చేస్తాం అంటున్నారని తెలిపారు. విచారణకి తాము సిద్ధమని ప్రకటించారు. గత ఎనిమిది నెలల్లో విశాఖలో జరిగిన భూ అక్రమాల పై జగన్ గారు విచారణకు సిద్ధమా? అని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు నారా లోకేష్.