YS Jagan, Chandrababu Naidu (Image Credit To Original Source)
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు అధికారంలో ఉండి మళ్లీ ప్రతిపక్షంలోకి రావడానికి తాము సిద్ధంగా లేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుజరాత్ స్పూర్తితో ఒకే ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకెళదామని చెప్పారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ నేతలు గ్రీన్ కో, భోగాపురం విమానాశ్రయం, అమరావతిపై విషం కక్కుతున్నారని చెప్పారు.
తాను ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ కనీస ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. “జగన్ బెంగుళూరులో ఉంటే బెంగుళూరు, ఇడుపులపాయలో ఉంటే అదీ రాజధాని అవుతుందా? మూడు ముక్కలాటను ప్రజలు నమ్మలేదు కాబట్టే కూటమికి మూడు ప్రాంతాల్లో అఖండ విజయం అందించారు.
Also Read: తప్పుడు రాతలతో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సగర్వంగా నినదిద్దాం. ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్. రెండింటి క్రెడిట్‌కూ పొంతనే లేనప్పుడు ఇక క్రెడిట్ చోరీకి అవకాశం ఎక్కడ? రాజకీయ ముసుగులో గిల్లికజ్జాలకు పాల్పడుతూ తోక జాడిస్తే ఎక్కడున్నా పట్టుకొచ్చి బట్టలూడదీస్తాం జాగ్రత్త.
రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తే ఉపేక్షించం. పల్నాడును శాంతియుత ప్రాంతంగా మార్చి చూపుతాం. నా ఇంటి గేటుకు ఆనాడు కట్టిన తాళ్లే ఉరితాళ్లు అవుతాయని ఆనాడు చెప్పిందే జరిగింది” అని అన్నారు.