శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై అంబటి రాంబాబు మరోసారి కీలక కామెంట్స్‌

డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు.

Ambati Rambabu

లడ్డూ కల్తీ వివాదంపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేగానీ, ఈ అంశం రాజకీయ ఆరోపణలతో ముడిపడి ఉండకూడదని చెప్పారు. ఇవాళ గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీఐజీ స్థాయి అధికారిని వేసి, విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని తెలిపారు.

డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు. డీఐజీ విచారణ అంటున్నారంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, హిందుత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాస్తవాలలో పసలేక ఇటువంటివి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష ఏంటని, ఎవరు చేయాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు తండ్రి చనిపోతే కనీసం తలనీలాలు ఇవ్వలేదని, అటువంటి వ్యక్తి ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. గోపూజ చేసి బయటకు వచ్చే కుటుంటం వైవీ సుబ్బారెడ్డిదని చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. టీడీపీ హయాంలో అనేక దేవాలయాలు పగలకొట్టి, మున్సిపాలిటీ బండ్లలో విగ్రహాలను తీసుకెళ్లలేదా అని ప్రశ్నించారు. వాస్తవాలు అన్నీ త్వరలో బయటకు వస్తాయని చెప్పారు.

Prakash Raj – Pawan Kalyan : నేను చెప్పింది ఏంటి..? అర్ధం చేసుకోండి ప్లీజ్.. పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..