పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైరల్‌ చేస్తున్నారు.. వారికి చెబుతున్నా..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

"నాకు ఓటమి భయం లేదు. నాకు, చంద్రబాబుకి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు" అని పవన్ అన్నారు.

పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైరల్‌ చేస్తున్నారు.. వారికి చెబుతున్నా..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 2:40 PM IST
  • పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు
  • పాల్గొని మాట్లాడిన పవన్ కల్యాణ్
  • కుల, మత విద్వేషాలను రేపితే ఊరుకోనని హెచ్చరిక

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పిఠాపురం అభివృద్ధి అందరికీ దిక్సూచిగా ఉండాలని అన్నారు.

“ఎన్నికల సమయంలో జనసేన విజయానికి సహకరించిన సినీ ప్రముఖులను ఆహ్వానించాను. ఏదైనా కూలగొట్టడం, చెడగొట్టడం సులభం… కానీ సృష్టించడం చాలా కష్టం. మూడు పార్టీలను కలపడం చాలా కష్టం. కూటమిని ఏర్పాటు చేశాం.

రైతులకు పంట ధాన్యం చేతికి వచ్చిన తర్వాత సక్రాంతి పండుగ చేసుకుంటారు. పిఠాపురంలో ఏమి జరిగినా సంచలనమే. చివరకి చెట్టుమీద ఆకు కింద పడ్డ అది పిఠాపురంలో దారుణమే… అని అంటారు. పోలీసు వారికి చెబుతున్నా.. పిఠాపురంలో కులాల, మత విద్వేషాలకు గురి చేస్తే మాత్రం ఊరుకోను.

Also Read: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే.. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వైజాగ్.. ఎవరు ఏ రూట్ లో వెళ్లాలంటే..

నేను రూల్స్ పాటిస్తాను.. నేను తప్పు చేసినా ఆ రూల్స్ మాకు వర్తిస్తాయి. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే మాత్రం ఇక్కడకు వచ్చి అందరి మీద చర్యలు తీసుకుంటాను. నాకు ఓటమి భయం లేదు. నాకు, చంద్రబాబుకి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు.

గత 5 సవంత్సరాల కాలంలో పిఠాపురం ఏమి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఏమి జరిగింది చూడండి. ఒక స్కూల్ లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్న అది న్యూసే. ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే అది కులాల గొడవ అంటారు. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ కోసం మనం కష్టపడితే వచ్చింది. మీరు గొడవ పెట్టుకోవాలి అంటే నేను సిద్ధంగా ఉన్నా” అని పవన్ అన్నారు.

సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాట, జూదాలేనా?
యుద్ధాన్ని ఎప్పుడూ బలవంతుడే భరిస్తాడని, బలహీనుడు అరుస్తాడని పవన్ అన్నారు. “రాజకీయాలు నాకు డబ్బు సంపాదన కోసం కాదు. గత ఏడాది రూ.318 కోట్లు, ఇప్పుడు రూ.212 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. పాలిటిక్స్‌ను బాధ్యతగా తీసుకుంటాను. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా సమాజానికి మనం ఇవ్వాలి.

మీరు అందరూ నా కుటుంబ సభ్యులు.. మీ ఆనందంగా ఉండాలి. పిఠాపురం శాశ్వతంగా సంక్రాంతి సంబరాలకు వేదిక కావాలి. సంక్రాంతి అంటే కోడిపందాలు, పేకాట, జూదాలేనా? సరదా ఉండాలి కానీ సంక్రాంతి వాటికి పరిమితి కాకూడదు.

మన సంస్కృతి, సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. పిఠాపురం భారత దేశానికి చాలా కీలకమైనది. ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ నేను పోటీ చేయడం దైవ సంకల్పం అని నమ్ముతాను. నేను నా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పని చేస్తాను. నారా చంద్రబాబు ప్రభుత్వం ప్రో యాక్టివ్ ప్రభుత్వం” అని తెలిపారు.