సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే.. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వైజాగ్.. ఎవరు ఏ రూట్ లో వెళ్లాలంటే..
టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారికి వెళ్లి యూ టర్న్ తీసుకుని, మళ్లీ సూర్యాపేట రూట్ వైపు రావాలి.
Panthangi toll gate (Image Credit To Original Source)
- సంక్రాంతి వేళ వాహనాలతో నిండిపోతున్న రోడ్లు
- హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా భారీగా వాహనాలు
- ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్లు
Sankranti 2026: సంక్రాంతి వేళ ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండడంతో వాహనాలతో రోడ్లు నిండిపోతున్నాయి. ఈ పండుగ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలు భారీగా ఉంటాయి.
దీంతో పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా ఏపీకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేస్తున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీ ఉండొచ్చు. దీనితో పాటు జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వారిని నార్కట్‌పల్లి వద్ద నల్గొండ, మిర్యాలగూడ, పిగుడురాళ్ల మీదుగా దారి మళ్లిస్తారు. అయినప్పటికీ నల్గొండ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో జాగ్రత్త వహించాలి.
Also Read: తెలంగాణలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించిన మంత్రులు
వేగ పరిమితిలో జాగ్రతతగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారికి వెళ్లి యూ టర్న్ తీసుకుని, మళ్లీ సూర్యాపేట రూట్ వైపు రావాలి. జాతీయ రహదారిపై నేరుగా వెహికిల్స్ వచ్చే విధంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు.
ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణించే వారు రాయినిగూడెం సైడ్ వచ్చి వాహనాలను యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. ఐలాపురం వద్ద రూట్ డైవర్ట్ చేసుకుని సూర్యాపేట మీదుగా వాహనాలు నేరుగా హైదరాబాద్ వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు చూస్తారు.
రాజమండ్రి -విశాఖపట్నం ప్రయాణించే వారు విజయవాడ హైవే పై నకిరేకల్ మీదుగా అర్వపల్లికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ రద్దీ విపరీతంగా ఉంటే టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారికి రూట్ డైవర్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్లవచ్చు.
