తెలంగాణలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించిన మంత్రులు

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ప్రారంభోత్సవం చేసి, 350 మంది రైతులకు రూ.1.07 కోట్ల విలువైన పనిముట్లు పంపిణీ చేశారు.

తెలంగాణలో మరో 2 కొత్త పథకాలను ప్రారంభించిన మంత్రులు

Tummala nageswara rao, Uttam kumar reddy (Image Credit To Original Source)

Updated On : January 9, 2026 / 12:13 PM IST
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం
  • వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభోత్సవం
  • ప్రకృతి వ్యవసాయ పథకం షురూ 

Agriculture Schemes: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట వ్యవసాయ కళాశాలలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండు వ్యవసాయ కొత్త పథకాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో పడావు పడ్డ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి, 350 మంది రైతులకు రూ.1.07 కోట్ల విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు.

Also Read: గుండె గుభేల్.. మళ్లీ పెరిగిపోయిన బంగారం ధరలు.. రేట్లు ఎంతగా ఉన్నాయంటే?

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల సంక్షేమానికి పాటుపడుతోందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.