ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఆ ప్లేస్‌లో టికెట్ దక్కించుకునేది..?

స్థానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కైకలూరుపై ఫోకస్ పెడుతున్నట్లు టాక్.

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఆ ప్లేస్‌లో టికెట్ దక్కించుకునేది..?

Kamineni Srinivas (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 9:57 PM IST
  • కైకలూరులో టికెక్‌ కోసం చాలామంది  ప్రయత్నాలు
  • గారపాటి సీతారామాంజనేయ చౌదరి కూడా?
  • జయమంగళ వెంకటరమణ సైతం పోటీ? 

Kamineni Srinivas: కామినేని శ్రీనివాస్‌.. సీనియర్ మోస్ట్‌ లీడర్. నాన్ కాంట్రవర్సీ నాయకుడిగా పేరుంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన‌ప్పుడు టీడీపీ వ్యవ‌స్థాప‌క స‌భ్యుల్లో ఒక‌రిగా కామినేని శ్రీనివాస్ ఉన్నారు. 2014లో కృష్ణాజిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించి..అప్పటి టీడీపీ..బీజేపీ పొత్తులో భాగంగా కీల‌క‌మైన వైద్యారోగ్య శాఖ‌ను చేప‌ట్టారు. త‌ర్వాత టీడీపీ, బీజేపీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

అప్పట్లోనే తాను ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని కూడా ప్రక‌టించారు. ఏమైందో ఏమో తెలియదు కానీ..2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆల్‌ ఆఫ్ సడెన్‌గా మళ్లీ నో పాలిటిక్స్ అంటున్నారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని..తానే కాదు తన కుటుంబ సభ్యులెవరూ ప్రత్యక్ష రజాకీయాల్లో ఉండరని ప్రకటించారు కామినేని.

అయితే కామినేని ఇంతపెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఒకవైపు వయసు పైపడటం, రాజకీయాలు ఆర్థిక భారంగా మారడంతో పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నారా.? లేక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదని భావిస్తున్నారా.?అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు

రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలని అనుకున్నా..తప్పని పరిస్థితుల్లో అందరూ కోరడంతో 2024లో పోటీ చేశానంటున్నారు కామినేని శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని..ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కామినేని చేసిన ఈ ప్రకటన బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కామినేని శ్రీనివాస్‌కు ప్రాధాన్యం దక్కడం లేదా?
కామినేని శ్రీనివాస్‌ చంద్రబాబుకు సన్నిహితుడు. సేమ్‌టైమ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా మంచి సంబంధాలున్నాయని అంటారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రి కావాలని ఆశపడ్డారు. కానీ బీజేపీ నుంచి ఒకరికే బెర్త్ దక్కడంతో.. కామినేనికి ఛాన్స్ లేకుండా పోయింది. సేమ్‌టైమ్‌ బీజేపీలో కామినేని శ్రీనివాస్‌కు ప్రాధాన్యం దక్కడం లేదట.

ఆ మధ్య ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా కామినేని ప్రస్తావించిన అంశం తీవ్ర దుమారం లేపింది. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు వెళ్లినప్పుడు..చిరంజీవి జగన్‌ను నిలదీశారని చెప్పుకొచ్చారు కామినేని. ఆ వ్యాఖ్యలపై బాలకృష్ణ రియాక్ట్ కావడంతో రచ్చ రచ్చ అయింది. చిరంజీవి రియాక్ట్ అయ్యే వరకు వచ్చింది వ్యవహారం. ఆ ఇష్యూలో తానొకటి అనుకుంటే మరొకటి అయిందని బాగా నొచ్చుకున్నారట కామినేని. ఇలా అన్ని కలగలిపి..రాజకీయాలకు రాం రాం చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కైకలూరు సీటు కోసం ప్రయత్నాలు
ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడంతో కైకలూరు సీటును దక్కించుకునేందుకు చాలామంది నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. స్థానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కైకలూరుపై ఫోకస్ పెడుతున్నట్లు టాక్.

మరోవైపు గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన అదే సామాజిక వర్గానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి కూడా కైకలూరి సీటుపై ఆసక్తిగా ఉన్నారట. వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ఈ మధ్యే..ఎమ్మెల్సీ పదవికి, ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో చేరిన జయమంగళ వెంకటరమణ కైకలూరు నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. రాజకీయాలకు గుడ్‌బై చెప్తూ కామినేని చేసిన ప్రకటన ఓ వైపు చర్చకు దారితీస్తుంటే..సీటు కోసం కర్చీప్‌ వేసేందుకు నేతలు పోటీ పడుతుండటం ఇంకింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.