తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. 25న రథసప్తమి వేడుకలు.. పలు సేవలు, దర్శనాలు రద్దు
రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
TTD (Image Credit To Original Source)
- ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
- ప్రివిలేజ్ దర్శనాల రద్దు
- 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు
Tirumala: తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. సప్తవాహనాలపై మాడవీధుల్లో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రథసప్తమిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. రథసప్తమి నేపథ్యంలో 24వ తేదీ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్థిక సేవలను కూడా రద్దు చేస్తున్నారు.
Also Read: ట్రంప్ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?
వాహన సేవలు
- 25న ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం.
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం
ఇవి రద్దు
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
- ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు
- తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు
- ప్రొటోకాల్ వీఐపీలకు మినహా సిఫార్సు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
