ప్రధానితో ముచ్చటించిన దుర్గ ఎవరంటే..
- bheemraj
- Published On : January 1, 2021 / 02:10 PM IST
woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది.
గాజువాకకు చెందిన దుర్గ, అప్పన్నబాబు దంపతులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరైంది. ఈ పథకం కింది అందిన రెండున్నర లక్షల రూపాయలకు మరింత సొమ్ము జోడించారు. తమకు నచ్చిన ఇంటిని అన్ని సౌకర్యాలతో అందంగా నిర్మించుకున్నారు.
పొదరిల్లు మాదిరిగా నిర్మించుకున్న పీఎంఏవై హౌస్.. దేశ ప్రజల దృష్టి ఆకర్షించడంతో దుర్గ దంపతులకు అరుదైన అవకాశం లభించింది. ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు.
