వైఎస్‌ జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు: ఆనం వెంకటరమణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా మందితో సమావేశమవుతారని, అయితే, దానిపై మీడియాకి సమాచారం ఇస్తారని తెలిపారు.

Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్‌ జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయనపై 16 సీబీఐ కేసులు ఉన్నాయని చెప్పారు.

అయినప్పటికీ కోర్టుకు వెళ్లలేదని, ఆయనపై ఉన్న కేసులపై సీబీఐ త్వరగా విచారణ చేపట్టాలని ఆనం అన్నారు. విద్యుత్ ఒప్పందాల్లోనూ అవినీతికి పాల్పడ్డారని, రూ.1,750 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. అదానీని జగన్ మూడుసార్లు ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా మందితో సమావేశమవుతారని, అయితే, దానిపై మీడియాకి సమాచారం ఇస్తారని తెలిపారు. ఆదానీతో జగన్ రహస్య చర్చ గురించి వివరాలు తెలిపాలని నిలదీశారు. రూ.1750 కోట్ల లంచం తీసుకున్నారని ఎఫ్‌బీఐ చెబుతోందని అన్నారు. ఆ ధనం ఎక్కడ ఉందని ఆనం అన్నారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో జగన్‌కు రూ.20 వేల కోట్ల లంచం ముట్టిందని ఆయన ఆరోపించారు.

Harish Rao: అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయింది: హరీశ్ రావు