Anandaiah Letters To Chief Minister Y S Jagan Mohan Reddy
Anandaiah Letters to CM Jagan: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీ సామగ్రికి సంబంధించిన మూలికలు, తదితరాలకు సహాయం చెయ్యలంటూ లేఖలో కోరారు. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సహాయం చెయ్యాలని, మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలో ఆనందయ్య పేర్కొన్నారు.
మందును ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఔషధాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని పోలీసులు అనుమతించట్లేదు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఆనందయ్య మందులో ఒకటైన K రకానికి హైకోర్టు అనుమతి ఇవ్వగా.. మందును రాష్ట్ర ప్రజలందరికీ అందజేసేందుకు.. ఇతర రాష్ట్రాలవారికి ఇచ్చేందుకు సహాయం చెయ్యాలని ఆనందయ్య సీఎం జగన్‌ను లేఖలో కోరారు.