Anantapur : బాలుడి హత్య కేసు.. బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడికి యత్నం.. కాల్పులు జరపడంతో..
Anantapur : అనంతపురం జిల్లాలో బాలుడి హత్యకేసును రీకన్ స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పోలీసులపై దాడికి యత్నించాడు.
- Harishth Thanniru
- Published On : March 27, 2026 / 07:51 AM IST
Anantapur boy murder case: Accused Sarvesh Kumar attempts to attack police
- అనంతపురం జిల్లాలో బాలుడి హత్య కేసు
- పోలీసులపై దాడికి యత్నించిన నిందితుడు
- కాల్పులు జరిపిన పోలీసులు
Anantapur : అనంతపురం జిల్లా యాడికిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన జల్సాలకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఇంటి అల్లుడే ఏడేళ్ల బావమరిదిని కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా హత్య చేశాడు. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో ఏడేళ్ల హేమచంద్రను సొంత బావ సర్వేశ్ బుధవారం కిడ్నాప్ చేశాడు. ఇదే మండలంలోని చింతలాయపల్లి-కుందనకోట ఘాట్‌రోడ్డు సమీప కొండపై అతని మృతదేహం గురువారం లభ్యమైంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బాలుడిని సొంత బావ సర్వేశ్ కిడ్నాప్ చేసి హత్యచేసినట్లు తేలింది. దీంతో సర్వేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సీన్‌రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితుడు పోలీసులపై దాడికి యత్నించాడు.
Also Read : Trump Warning: త్వరగా యుద్ధం ముగించకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి- ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
బాలుడి హత్యకేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడు సర్వేశ్ కుమార్‌ను పోలీసులు ఘటనాస్థలికి తీసుకెళ్లారు. ఘటన స్థలిలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో నిందితులు పోలీసులపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అవాక్కైన పోలీసులు నిందితుడి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆత్మరక్షణ కోసం గాలిలోకి తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.
పలుసార్లు హెచ్చరించినా నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో అతడి మోకాళ్లపై సీఐ కాల్పులు జరిపారు. రెండు కాళ్లకు బుల్లెట్లు తగలడంతో నిందితుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటలో నిందితుడితోపాటు సీఐ, మరో కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. నిందితుడు సర్వేశ్, సీఐ, కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.
