Trump Warning: త్వరగా యుద్ధం ముగించకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి- ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
Trump Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ ను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. అమెరికా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్లీ వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారాయన. యుద్ధంలో ఇరాన్ గెలవడం అనేది కల్ల అని కూడా స్పష్టం చేశారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. ఒప్పందంపై ఇరాన్ మరోసారి దృష్టి సారించాలని ట్రంప్ సూచించారు.
అమెరికా అధికారుల ప్రకారం, పెంటగాన్ చేసిన ఈ 4 ప్రతిపాదనల్లో ఒకదాన్ని ట్రంప్ ఎంచుకోవచ్చు..
* ఖార్గ్ ద్వీపాన్ని ఆక్రమించడం లేదా దిగ్బంధించడం
* హోర్ముజ్ జలసంధిని క్లియర్ చేసేందుకు లరక్ ద్వీపంపై దాడి చేయడం
* అబు ముసా, మరో రెండు చిన్న ద్వీపాలను సీజ్ చేయడం
* ఇరాన్ ఆయిల్ ఎక్స్ పోర్ట్ చేస్తున్న నౌకలను బ్లాక్, సీజ్ చేయడం
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. అమెరికా,ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేశాయి. అప్పటి నుంచి ఇరాన్‌పై 7వేల 800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది యూఎస్ సైనికులు మరణించగా.. సుమారు 200 మంది గాయపడినట్లు తెలిపింది. ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. మరోవైపు హర్మూజ్ జలసంధిని నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది.
Also Read: ట్రంప్ జబర్దస్త్ కామెడీ.. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండమందట.. కోతల రాయుడు..
